#YogiToNews18 | హిందీ భాషతో ప్రయోజనాలెన్నో.. మహాత్ముడి మాట గుర్తు చేసిన యోగి ఆదిత్యనాథ్

#YogitoNews18 | హిందీ భాషను వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలపై యూపీ సీఎం స్పందించారు. వ్యతిరేకించడమే కొందరి నైజమన్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 7:58 PM IST
#YogiToNews18 | హిందీ భాషతో ప్రయోజనాలెన్నో.. మహాత్ముడి మాట గుర్తు చేసిన యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (File)
news18-telugu
Updated: September 18, 2019, 7:58 PM IST
హిందీ దేశానికి బొట్టు (తిలకం) లాంటిదని మహాత్మాగాంధీనే చెప్పారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హిందీని జాతీయ భాషగా చేస్తే దాని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. న్యూస్‌ 18 నెట్‌వర్క్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘స్థానిక భాషతో కలిపి మనం హిందీని ప్రమోట్ చేస్తే చాలా మంచిది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో పనిచేసుకునే హక్కు లేదా? లక్నో, భోపాల్‌లో ఉద్యోగం చేసే హక్కు లేదా?, అతడు లేదా ఆమె హిందీ భాషను నేర్చుకుంటే వారికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా పనిచేయవచ్చు.’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

నాలుగు రోజుల క్రితం హిందీ దివస్ సందర్భంగా దేశాన్ని హిందీ ద్వారా ఏకం చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీన్ని తమిళనాడు చెందిన డీఎంకే చీఫ్ స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటివారు తప్పుపట్టారు. అయితే, ఈ వివాదంపై అమిత్ షా స్పందించారు. తానెప్పుడూ స్థానిక భాషలను కాదని హిందీని రుద్దాలని చెప్పలేదని స్పష్టం చేశారు. మాతృభాషతోపాటు హిందీని కూడా నేర్చుకుంటే మంచిదని చెప్పానన్నారు. తాను కూడా హిందీయేతర గుజరాత్ నుంచి వచ్చిన వాడినేనని అమిత్ షా హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు.

అధికార భాషను గుర్తించడం, దేశాన్ని ప్రతిబింబించే భాషను గౌరవించడం మన బాధ్యత. కోర్టుల్లో ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషల్లోనూ తీర్పులు ఇస్తున్నారు. తమిళనాడులో ప్రజలు తమిళం మాట్లాడతారు. కాబట్టి, ఇంగ్లీష్, తమిళం రెండూ ఉన్నాయి. కేరళకు వెళితే అక్కడ సామాన్యుడికి మలయాళం తెలుసు. అక్కడ వారికి ఇంగ్లీష్‌‌తో పాటు హిందీని కూడా నేర్పిస్తే మంచి ప్రయత్నమే కదా. హిందీ దేశానికి తిలకం లాంటిదని మహాత్మా గాంధీ కూడా చెప్పారు. హిందీ మన దేశ సౌందర్యం. అది మంచిది.

- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి




హిందీ భాషను వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలపై యూపీ సీఎం స్పందించారు. వ్యతిరేకించడమే కొందరి నైజమన్నారు. ట్రిపుల్ తలాక్ వద్ద తరతరాలుగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సుప్రీంకోర్టు వారికి సాయం చేసిందని, బీజేపీ చట్టం తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకించారని యోగి విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశం మొత్తం ప్రధాని మోదీ, అమిత్ షాకు మద్దతుగా నిలిచిందని, అయితే కొందరు మాత్రం దాన్నీ వ్యతిరేకించారని యోగి అన్నారు. అసలు దేన్ని వ్యతిరేకిస్తున్నారో కూడా వారికి తెలియదని, కేవలం వ్యతిరేకించడమే వారి పని అంటూ ఎద్దేవా చేశారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...