వాటిపై కూడా విచారణ జరపండి.. టీడీఎల్పీ డిమాండ్...

జగన్‌కు ధైర్యం ఉంటే గత ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేతలు డిమాండ్​ చేశారు.

news18-telugu
Updated: June 11, 2020, 11:17 PM IST
వాటిపై కూడా విచారణ జరపండి.. టీడీఎల్పీ డిమాండ్...
వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే అని టీడీపీ అధినేత విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని.. సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా అని ప్రశ్నించారు.
  • Share this:
చంద్రబాబు పాలనలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్నకానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక వంటి పథకాల్లో అవినీతి జరిగిందని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. ఫైబర్ గ్రిడ్, కానుకల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సబ్ కమిటీ సిఫారసు చేసింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశంపై టీడీఎల్పీ మండిపడింది. వైసీపీ ఏడాది పాలన అంతా అవినీతిమయమని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీబీఐ విచారణను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. మద్యం, ఇసుక, గనులు, భూసేకరణ, కరోనా కిట్లు, బ్లీచింగ్‌లో కుంభకోణాలు జరిగాయన్న చంద్రబాబు...టీడీపీ ఛార్జిషీట్‌లో వీటన్నింటినీ బట్టబయలు చేసినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో తెచ్చిన ఫైబర్ గ్రిడ్‌ను సక్రమంగా ఉపయోగించడం చేతకాక మూలనపడేసి బురద జల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పథకం నిలిచిపోవడం వల్ల ఏడాదిగా ఎన్నో పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేయడంపై ప్రజల్లో జగన్ మీద వ్యతిరేకత వచ్చిందని టీడీఎల్పీ నేతలు అభిప్రాయపడ్డారు. జగన్‌కు ధైర్యం ఉంటే గత ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేతలు డిమాండ్​ చేశారు. మైనింగ్​, మద్యం మాఫియాపైనా విచారణ చేయాలన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 11, 2020, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading