Tamilnadu: బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై పన్నీర్ సెల్వం కీలక ప్రకటన

తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకెళ్తాయని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. అనంతరం మాట్లాడిన అమిత్ షా.. పళనిస్వామి హయాంలో తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 6:26 PM IST
Tamilnadu: బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై పన్నీర్ సెల్వం కీలక ప్రకటన
Tamilnadu: బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై పన్నీర్ సెల్వం కీలక ప్రకటన
  • Share this:
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత మరణం తర్వాత కాస్త డీలా పడిన అన్నాడీఎంకే భవిష్యత్ ఏంటి? ఒంటరిగానే బరిలోకి దిగుతుందా? బీజేపీతో కలిసి డీఎంకేను ఎదుర్కొంటుందా? అనే ప్రశ్నలు కొన్ని రోజులుగా తమిళనాట వినిపిస్తున్నాయి. బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీచేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల బంధంపై తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీచేస్తాయి ప్రకటించారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటించారు. వర్చువల్ వేదికగా తెర్వాయ్‌కండిగై రిజర్వాయర్‌‌ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం చెన్నె మెట్రో రెండో దశకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి దివంగత సీఎం జయలలిత చిత్రపటానికి నివాళి అర్పించారు కేంద్ర హోంమంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకెళ్తాయని స్పష్టం చేశారు.



అనంతరం మాట్లాడిన అమిత్ షా.. పళనిస్వామి హయాంలో తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. '' కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంది. సుపరిపాలనలో ఈ ఏడాది తమిళనాడు మొదటి స్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఒకటి తమిళనాడు.'' అని పేర్కొన్నారు అమిత్ షా.

కాగా, శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. అమిత్ షాకు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌, ఇతర నేతలు సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి లీలా ప్యాలెస్‌కు వెళ్లే దారిలో కారు నుంచి బయలకు దిగారు అమిత్ షా. కొంత దూరం వరకు కాలి నడకన వెళ్లారు. తనను ఆహ్వానించేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. రోడ్డుపై నడుస్తున్న అమిత్ షాను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.

చెన్నైలో అమిత్ షా పర్యటనను డీఎంకే సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి అమిత్ షాపై బ్యానర్ విసిరేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అటు సోషల్ మీడియాలో అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్ల మోత మోగించారు. #GoBackAmitShah హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading