స్పీకర్‌గా కోడెల హయాం వివాదాల మయం... రోజాపై సస్పెన్షన్‌తో...

స్పీకర్ కోడెల శివప్రసాదరావు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీకి చెందిన కొందరు సభ్యులను అవమానించే రీతిలో మాట్లాడారన్న ఆరోపణలపై రోజాను యేడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశించారు.

 • Share this:
  ఏపీ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర స్పీకర్‌గా కోడెల పనిచేశారు. అయితే ఆయన స్పీకర్‌గా పనిచేసిన హయాంలో సభలో ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. స్పీకర్ తీరుపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ భగ్గుమంది. ముఖ్యంగా రోజా విషయంలో స్పీకర్‌గా కోడెల తీరును తీవ్రంగా తప్పుపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీకి చెందిన కొందరు సభ్యులను అవమానించే రీతిలో మాట్లాడారన్న ఆరోపణలపై రోజాను యేడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశించారు. అయితే దీనిపై వైసీపీ నేతల భగ్గుమన్నారు. ఉరి శిక్ష వేసిన ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, రోజాకు ఆ అవకాశం కూడా కల్పించలేదని వైసీపీ నాయకులు తప్పుపట్టారు.

  అంతేకాకుండా ఆయన స్పీకర్‌గా ఉన్న హయాంలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేగా రోజాను రాకుండా కోడెల అడ్డుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమెను ఆహ్వానించిన మాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అప్పట్లో అంగీకరించారు. అయితే సదస్సుకు వస్తున్న రోజాను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడంపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

  అప్పటి అసెంబ్లీలో రోజా ఎపిసోడ్ విషయంలో స్పీకర్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తే.. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని కూడా స్సీకర్‌గా ఆయన సమర్థించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వ్యవహార శైలిపై అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ కోడెలపై అవిశ్వా తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు. స్పీకర్ వ్యవహారశైలి అధికార పార్టీకి వంతపాడేలా అప్పట్లో వైసీపీ విమర్శించింది. ప్రతినేతకు గానీ, ఇతర ప్రతిపక్ష సభ్యులకుగానీ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగన్ మండిపడ్డారు. స్పీకర్ పై ఉన్న నమ్మకం, గౌరవం పోయాయని అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని అప్పట్లో జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ ఏడాది పాటు వైసీపీ సభ్యులెవరూ సభకు రాకుండా పోయారు. మొత్తం మీద ఐదేళ్ల పాటు స్పీకర్ టెర్మ్ అంతా కోడెల వివాదాల మధ్యే కొనసాగించారు.

   
  Published by:Sulthana Begum Shaik
  First published: