Home /News /politics /

ARVIND KEJRIWAL WORDS WITH A TEACHER IN PUNJAB WHO BOARDED A WATER TANK ARE GOING VIRAL PRV

Aravind Kejriwal: ‘‘మేం టీచర్లను ఇంగ్లాండ్​, స్వీడన్​ పంపుతుంటే.. ఈ రాష్ట్రంలో మాత్రం వాటర్​ ట్యాంకులు ఎక్కిస్తున్నారు.. ’’: అరవింద్​ కేజ్రీవాల్​

అరవింద్​ కేజ్రీవాల్​ (Photo: ANI/Twitter)

అరవింద్​ కేజ్రీవాల్​ (Photo: ANI/Twitter)

పంజాబ్​లో టీచర్లు (Punjab teachers) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 45 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఓ టీచర్​ ఏకంగా వాటర్​ ట్యాంకు ఎక్కాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తితో అరవింద్​ కేజ్రీవాల్​ మాట్లాడిని మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
    అరవింద్​ కేజ్రీవాల్ (Aravind Kejriwal). సమాజ సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే అధికారాన్ని దక్కించుకున్న వ్యక్తి. ఢిల్లీలో అప్పటివరకు ఉన్న అధికార కాంగ్రెస్​.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వంతో ఆప్​ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పట్లేదు. ఇదే క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ (Delhi CM Aravind Kejriwal) పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పోటీలో తన పార్టీ అభ్యర్థులను నిలుపుతున్నారు కేజ్రీవాల్​. ఇదే క్రమంలో పంజాబ్​లోనూ అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు ఢిల్లీ సీఎం. అయితే పంజాబ్​లో ఎన్నికలు కొన్ని నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు పంజాబ్​లో టీచర్లు (Punjab teachers) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 45 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఓ టీచర్​ ఏకంగా వాటర్​ ట్యాంకు ఎక్కాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తితో అరవింద్​ కేజ్రీవాల్​ మాట్లాడిని మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

    ఏం జరిగిందంటే..

    పర్మినెంట్ ఉద్యోగాలు (permanent jobs), మెరుగైన జీతాల (good salary) కోసం చాలా కాలంగా కాంట్రాక్టు టీచర్లు పంజాబ్​లో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పంజాబ్ ఎడ్యుకేషన్ బోర్డ్ వెలుపల టీచర్లు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కొంతమంది ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ (Water tank) పైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.

    మీ సోదరుడిగా భావిస్తే..

    ‘నన్ను మీ సోదరుడిగా భావిస్తే, దయచేసి కిందకు దిగండి. మేం త్వరలో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం’ అంటూ పంజాబ్‌లోని కాంట్రాక్టు టీచర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మొహాలీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ వాహనంపై ఎక్కి పైకి చూస్తూ వారితో మైక్‌లో సంభాషించారు. కిందకు దిగి రావాలని వారిని కోరారు.

    ‘మీరు ఎంతకాలం నుంచి నిరసనలు చేస్తున్నారు?’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దానికి వారు ‘సార్, 45 రోజులు’ అని బదులిచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలోని ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఇంగ్లండ్, స్వీడన్‌ దేశాలకు పంపుతున్నాం. పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కారు వారిని ఓవర్‌ హెడ్ వాటర్ ట్యాంకులకు పంపుతోంది’ అని అన్నారు. ఢిల్లీలో విద్యావ్యవస్థను (Education system) పూర్తిగా సంస్కరించామని, ఈ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు.  . కాంట్రాక్టు టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Aravind Kejriwal, Private teachers, Punjab

    తదుపరి వార్తలు