కేజ్రీవాల్ దేశ భద్రతను రిస్క్‌లో పెడుతున్నారా..?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు దీనిపై మాట్లాడుతూ..' ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. కేవలం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే.. ఇచ్చిన హామీలు అమలుచేసేందుకుఉత్సాహం కనబరుస్తారు. ఢిల్లీ ప్రభుత్వం సీసీటీవీ కెమెరాల కోసం ఇచ్చిన కాంట్రాక్టు దేశ భద్రతను రిస్క్‌లో పెట్టినట్టే' అన్నారు.

news18-telugu
Updated: July 11, 2019, 3:14 PM IST
కేజ్రీవాల్ దేశ భద్రతను రిస్క్‌లో పెడుతున్నారా..?
అరవింద్ కేజ్రీవాల్(File Photo)
  • Share this:
ఢిల్లీ నగరంలో సీసీటీవి కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇచ్చిన ఓ కాంట్రాక్ట్ జాతీయ భద్రతను రిస్క్‌లోకి నెట్టింది. 1.5లక్షల సీసీటీవి కెమెరాల ఏర్పాటుకై హిక్‌విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించింది. అయితే ఈ కంపెనీలో మెజారిటీ వాటాదారు
చైనా ప్రభుత్వం కావడం గమనార్హం. గతంలో డేటా హ్యాకింగ్ ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో కూడా పెట్టింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు దీనిపై మాట్లాడుతూ..' ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. కేవలం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే.. ఇచ్చిన హామీలు అమలుచేసేందుకుఉత్సాహం కనబరుస్తారు. ఢిల్లీ ప్రభుత్వం సీసీటీవీ కెమెరాల కోసం ఇచ్చిన కాంట్రాక్టు దేశ భద్రతను రిస్క్‌లో పెట్టినట్టే' అన్నారు. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కేజ్రీవాల్‌ను నక్సలైట్ అని అభివర్ణించారు.

కాగా, ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో సీసీటీవి కెమెరాల ఏర్పాటు గురించి మాట్లాడారు.ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్‌రూమ్స్‌లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని.. తద్వారా తమ కొడుకు లేదా కూతురు స్కూల్‌లో ఎలా చదువుతున్నారో.. వారి తల్లిదండ్రులు చూసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నవంబర్ వరకు స్కూళ్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>