రాత్రి నుంచి జైట్లీ ఆరోగ్యం మరింత విషమం...

శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అరుణ్‌ జైట్లీని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఆగష్టు 9 నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు,

news18-telugu
Updated: August 24, 2019, 7:43 AM IST
రాత్రి నుంచి జైట్లీ ఆరోగ్యం మరింత విషమం...
అరుణ్ జైట్లీ (ఫైల్ ఫొటో)
  • Share this:
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 9న శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అరుణ్‌ జైట్లీని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు.అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. గురువారం ఆయనకు వైద్యులు డయాలసిస్‌ చేశారు. పలువురు బీజేపీ నేతలు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఎయిమ్స్‌ చేరుకొని జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...