Arun Jaitley: కొనసాగుతున్న అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర

జైట్లీ కడసారి చూపుకోసం పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 2:23 PM IST
Arun Jaitley: కొనసాగుతున్న అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర
అరుణ్ జైట్లీ
news18-telugu
Updated: August 25, 2019, 2:23 PM IST
మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర కొనసాగుతోంది.. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీకి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన పార్థీవ దేహాన్ని 1.30 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభించారు. జైట్లీ కడసారి చూపుకోసం పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె, అమిత్ షా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎల్డీ నేత అజీత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోహ్రా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు అరుణ్‌జైట్లీ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ..అరుణ్‌ జైట్లీ లాంటి గొప్ప సంస్కరణకర్తను దేశం కోల్పోయిందన్నారు . విద్యార్థి నాయకుడి నుంచి అంచలంచలుగా జైట్లీ ఎదిగారని గుర్తుచేశారు. తనకు జైట్లీతో 25 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబు గుర్తుచేశారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...