Arun Jaitley Death News | అరుణ్ జైట్లీ... హైదరాబాద్ తెలంగాణకు దక్కడంలో కీరోల్

Arun Jaitley on Telangana | ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్ మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. హైదరాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు విభజించాలని, దాన్ని పర్మినెంట్‌గా ఉమ్మడి రాజధాని చేయాలని లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి.

news18-telugu
Updated: August 24, 2019, 12:43 PM IST
Arun Jaitley Death News | అరుణ్ జైట్లీ... హైదరాబాద్ తెలంగాణకు దక్కడంలో కీరోల్
అరుణ్ జైట్లీ
news18-telugu
Updated: August 24, 2019, 12:43 PM IST
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అరుణ్ జైట్లీ పాత్ర మరువలేనిది. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఆయన తెలంగాణ వైపే నిలిచారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్ మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. హైదరాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు విభజించాలని, దాన్ని పర్మినెంట్‌గా ఉమ్మడి రాజధాని చేయాలని లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఆ సందర్భంలో హైదరాబాద్ ఆదాయాన్ని పంపడం సరికాదని, అది పూర్తిగా తెలంగాణకే దక్కుతుందని స్పష్టం చేశారు. దీని వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని, న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని వాదించారు.

అదే సమయంలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను ప్రతిపాదించిన వారిలో వెంకయ్యనాయుడుతో పాటు జైట్లీ కూడా ఒకరు. రాజ్యసభలో బీజేపీ ఎంపీలుగా ఉన్న వారిద్దరూ పట్టుబట్టడంతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని సభలో ప్రకటించారు. అయితే, ఆ తర్వాత ప్రధాని మోదీ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ.. హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చారు. హోదాతో సమానమైన లాభం కలుగుతుందని చెప్పారు. అయితే, దీనిపై విభేదించిన టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...