నాకు కేంద్రమంత్రి పదవి వద్దు...మోదీకి అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి

మళ్లీ కొన్ని రోజులు ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి లేఖ రాసిన జైట్లీ..కేబినెట్‌లో తనకు బాధ్యతలు అప్పగించొద్దని విజ్ఞప్తిచేశారు.

news18-telugu
Updated: May 29, 2019, 3:04 PM IST
నాకు కేంద్రమంత్రి పదవి వద్దు...మోదీకి అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి
అరుణ్ జైట్లీ
news18-telugu
Updated: May 29, 2019, 3:04 PM IST
నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రమాణస్వీకార కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలతో పాటు ఎన్డీయే నేతలు, విపక్ష నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఐతే ప్రమాణస్వీకారానికి ఒక్క రోజు ముందు నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ లేఖ రాశారు. అనారోగ్య కారణాలతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి వద్దని...అనారోగ్యం నుంచి కోలుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో కొన్ని రోజులు పాటు నా బాధ్యతలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. అప్పుడే నా ఆరోగ్యం, చికిత్సపై దృష్టిసారించేందుకు వీలుపడుతుంది. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.
లేఖలో అరుణ్ జైట్లీ
కొంతకాలంగా సాఫ్ట్ టిష్యూ కేన్సర్‌తో అరుణ్ జైట్లీ బాధపడుతున్నారు. అమెరికాలో ఆయనకు సర్జరీ జరిగింది. అనారోగ్య కారణాలతో బడ్జెట్ సమయంలోనూ అరుణ్ జైట్లీ అందుబాటులో లేరు. తాత్కాలిక ఆర్థికమంత్రి హోదాలో పీయుష్ గోయెల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ మధ్య కోలుకున్నట్లు కనిపించినా..మళ్లీ కొన్ని రోజులు ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి లేఖ రాసిన జైట్లీ..కేబినెట్‌లో తనకు బాధ్యతలు అప్పగించొద్దని విజ్ఞప్తిచేశారు.
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...