అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి... తలకొరివి పెట్టిన కొడుకు రోహన్

ప్రముఖ నేతలంతా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నిగంబోధ్ ఘాట్‌లోనే ఉన్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 4:09 PM IST
అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి... తలకొరివి పెట్టిన కొడుకు రోహన్
అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
  • Share this:
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జైట్లీ కుమారుడు రోమన్ తండ్రికి తలకొరివి పెట్టాడు. జైట్లీ కడసారి చూపుల కోసం పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియలకు తరలివచ్చారు. ఉపరాష్త్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఫడ్నవీస్, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖ నేతలంతా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నిగంబోధ్ ఘాట్‌లోనే ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ప్రధాని మోదీ జైట్లీ అంత్యక్రియలకు రాలేకపోయారు. మరోవైపు జైట్లీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చి జైట్లీకి నివాళులర్పించారు. అధికార పార్టీతో పాటు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోహ్రా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్ఎల్డీ నేత అజీత్ సింగ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అరుణ్ జైట్లీ 1952 నవంబరు 28న న్యూఢిల్లీలో జన్మించారు. జైట్లీకి భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సొనాలి ఉన్నారు. అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి నేతగా పనిచేశారు. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్ నారాయణ్, జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేకగా ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక భూమిక పోషించారు జైట్లీ. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ లో చేరారు. 1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్ హయాంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్‌గానూ సేవలందించారు జైట్లీ.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు