రాజకీయాల్లోకి ‘రాముడు’... త్వరలో కాంగ్రెస్ తీర్థం

రాముడు ఏంటి? రాజకీయాల్లోకి రావడం ఏంటి? అది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటనే సందేహిస్తున్నారా? అయితే, ఈ స్టోరీ చదవండి.

news18-telugu
Updated: February 6, 2019, 3:10 PM IST
రాజకీయాల్లోకి ‘రాముడు’... త్వరలో కాంగ్రెస్ తీర్థం
రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్
  • Share this:
రామాయణం సీరియల్‌లో రాముడిగా కోట్లాది మంది ప్రజల మనసులు దోచుకున్న అరుణ్ గోవిల్ రాజకీయాల్లోకి రానున్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 1980వ దశకంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం ఎంతో పాపులర్ అయింది. దేశం మొత్తం ఆ సీరియల్ కోసం ఎదురుచూసేది. ఆ సీరియల్‌లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్ నటించారు. అచ్చం శ్రీరాముడు కూడా ఇలాగే ఉంటాడా అనేలా ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు.

రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్
రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్


ఇండోర్ లోక్‌సభ స్థానంలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ శతవిథాలా ప్రయత్నిస్తోంది. ఇండోర్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట. అక్కడి బీజేపీ ఎంపీ, ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఢీకొట్టి గెలిచే వారు లేరు. దాదాపు ఎనిమిదిసార్లుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే ఉంది. అయితే, ఈ సారి గట్టి పోటీ ఇవ్వాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ‘రామబాణం’లా కనిపిస్తున్నారు అరుణ్ గోవిల్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అరుణ్ గోవిల్ భార్య ఇండోర్‌కు చెందిన వారు.

రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్
రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్


పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో కనీసం 20 సీట్లలో గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది. కొత్త వారితో పాటు స్థానికంగా బలం ఉన్న కొందరు మంత్రులను కూడా బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
First published: February 6, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading