HOME »NEWS »POLITICS »article 370 revoked this to change for jammu and kashmir after this historic decision ba

Jammu and Kashmir | ఆర్టికల్ 370 రద్దుతో జరిగే 10 మార్పులు...

Jammu and Kashmir | ఆర్టికల్ 370 రద్దుతో జరిగే 10 మార్పులు...
జమ్మూకాశ్మీర్ మ్యాప్

Article 370 Revoked | కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది.

  • Share this:
    కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటోమేటిక్‌గా 35ఏ కూడా రద్దయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో వచ్చే మార్పులేవి? దీని వల్ల దేశంలో ఇతర ప్రాంతాల ప్రజలకు వచ్చే లాభాలేవి? అనే అంశాలు తెలుసుకుందాం.

    1. ద్వంద్వ పౌరసత్వం రద్దవుతుంది. ఇన్నాళ్లూ కాశ్మీరీలకు భారత్‌తోపాటు వారి రాష్ట్రంలో సొంత పౌరసత్వం కూడా ఉండేది.



    2. భారత ప్రభుత్వం చేసే చట్టాలన్నీ ఆటోమేటిక్‌గా జమ్మూకాశ్మీర్‌లో కూడా అమలవుతాయి.

    3. జమ్మూకాశ్మీర్లో ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు ఉండవు. గతంలో భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను మళ్లీ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో కూడా ఆమోదించాల్సి ఉండేది.

    4. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా జమ్మూకాశ్మీర్‌లో భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. గతంలో ఈ అవకాశం లేదు.

    5. అవసరమైతే ఆర్టికల్ 360 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే వెసులుబాటు ఉంది.

    6. రెండు జెండాలు ఉండవు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేది. భారత జెండాతో పాటు ఆ జెండా రెండింటినీ ఎగరేసేవారు. ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక జెండా అనేది ఉండదు.

    7. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి (జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి). గతంలో ఆరేళ్లకు ఓసారి ఎన్నికలు జరిగేవి.

    8. పోలీసు వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది.

    9. వ్యాలీలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఏర్పాటు చేయొచ్చు

    10. కాశ్మీర్‌లో హిందూ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే అవకాశం
    Published by:Ashok Kumar Bonepalli
    First published:August 05, 2019, 16:12 IST

    टॉप स्टोरीज