Jammu and Kashmir | దేశం తల నరికేశారు.. కేంద్రంపై ఆజాద్ ఆగ్రహం

Jammu and Kashmir | జమ్మూకాశ్మీర్ రాష్ట్రం దేశానికి తలలా ఉండేదని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ తలను రెండు ముక్కలుగా నరికేసిందని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 5, 2019, 3:23 PM IST
Jammu and Kashmir | దేశం తల నరికేశారు.. కేంద్రంపై ఆజాద్ ఆగ్రహం
గులాం నబీ ఆజాద్ (File)
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశం తల నరికేశారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రం దేశానికి తలలా ఉండేదని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ తలను రెండు ముక్కలుగా నరికేసిందని మండిపడ్డారు. కాశ్మీర్ విభజనను కలలో కూడా ఊహించలేదని చెప్పారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో అలజడి సృష్టించారని, జమ్మూకాశ్మీర్‌లో ఏదో జరుగుతోందని భయపెట్టారని ఆజాద్ అన్నారు. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలోనే అణుబాంబు వేశారని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం స్వరూపం ఏమైనా మారుతుందా అని ఆజాద్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొంత భాగం పాక్, మరికొంత భాగం చైనా ఆధీనంలో ఉందని, దాన్ని తీసుకురాగలరా అని ఆజాద్ నిలదీశారు. చైనా బలగాల మీద యుద్ధానికి వెళ్లగలరా అని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల కాశ్మీరీలకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదని ఆజాద్ న్నారు. కేంద్రంలో మెజారిటీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరు మీద ఆజాద్ దుమ్మెత్తిపోశారు. ఇంత కీలకమైన బిల్లును ఒకే రోజు పార్లమెంట్‌ ముందుకు తెచ్చి వెంటనే పాస్ చేయడం ఏంటని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు

First published: August 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు