ఆ వ్యాఖ్యలు చేసినందుకు శశి థరూర్‌కి అరెస్ట్ వారెంట్ జారీ..

Arrest Warrant Against Shashi Tharoor : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి.. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని శశి థరూర్ అప్పట్లో అన్నారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని.. ఒక రకంగా దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తారని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: August 13, 2019, 10:31 PM IST
ఆ వ్యాఖ్యలు చేసినందుకు శశి థరూర్‌కి అరెస్ట్ వారెంట్ జారీ..
శశి థరూర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కి కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది 'హిందూ పాకిస్తాన్' అంటూ శశి థరూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తిరువనంతపురంకి చెందిన న్యాయవాది సుమిత్ చౌదరి కోర్టును ఆశ్రయించడంతో.. ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. గతేడాది జులైలో శశి థరూర్ మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్‌ను 'హిందూ పాకిస్తాన్'గా మారుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి.. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని శశి థరూర్ అప్పట్లో అన్నారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని.. ఒక రకంగా దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తారని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ,నెహ్రూ,సర్దార్ పటేల్,మౌలానా అజాద్ వంటి స్వతంత్ర సమరయోధులు ఇలాంటి భారత్ కోసమేనా పోరాడిందని అన్నారు. థరూర్ చేసిన వ్యాఖ్యల్లో 'హిందూ పాకిస్తాన్' అన్న పదంపై తీవ్ర దుమారం రేగింది. ఇదే కేసులో ఇప్పుడు కోర్టు ఆయనకు

అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Published by: Srinivas Mittapalli
First published: August 13, 2019, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading