ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎంత నిజం? రాజ్‌దీప్ ట్వీట్‌కు అర్థమేమిటి?

Telangana assembly elections2018|తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని.. జాతీయ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం.. తెలంగాణలో కూటమిదే అధికారమని జోస్యం చెప్పారు. దీంతో అటు అధికారపక్షానికి, ఇటు విపక్షానికి.. సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

news18-telugu
Updated: December 8, 2018, 4:53 PM IST
ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎంత నిజం? రాజ్‌దీప్ ట్వీట్‌కు అర్థమేమిటి?
Telangana assembly elections2018|తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని.. జాతీయ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం.. తెలంగాణలో కూటమిదే అధికారమని జోస్యం చెప్పారు. దీంతో అటు అధికారపక్షానికి, ఇటు విపక్షానికి.. సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
  • Share this:
పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన జాతీయ మీడియా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అయితే, ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. కొద్దిసేపట్లోనే పూర్తిభిన్నమైన సర్వే ఫలితాలను విడుదల చేశారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సర్వేలు చేయించడంలో దిట్టగా పేరున్న లగడపాటి విడుదల చేసిన ఫలితాలు ప్రజాకూటమి వైపు ఉండడంతో.. తెలంగాణలో విజయం ఎవరిదనే విషయంలో విశ్లేషకులు సైతం ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి ఏర్పడింది. అందరూ డిసెంబర్ 11 వరకు వేచిచూడాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు జాతీయ మీడియా సర్వేల ఫలితాల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సంస్థలన్నీ ఉత్తర భారతదేశానికి చెందినవనీ.. వాటికి దక్షిణభారత జనం నాడి పసిగట్టడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, గతంలో పార్లమెంటు ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో.. ఈ జాతీయ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అసలు ఫలితాలతో ఏమాత్రం మ్యాచ్ కాకపోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.

2004 సాధారణ ఎన్నికల్లో దాదాపుగా 255 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకోబోతోందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. 219 స్థానాలతో యూపీఏ కూటమి, ప్రాంతీయ పార్టీల సహకారంతో గద్దెనెక్కింది. 2014 పార్లమెంట్ ఎన్నిల్లోనూ జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్కతప్పాయి. ఎన్డీఏ కూటమికి సాధారణ మెజార్టీ వస్తుందని ఆయా సంస్థల సర్వే ఫలితాలు చెప్పగా.. 336 స్థానాలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకారం.. 100 స్థానాలు దాటుతుందనుకున్న యూపీఏ.. 60 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కించుకుని ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది.


గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు దూరంగా ఉన్నాయి. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. చివరకు జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆప్‌కు 67 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలూ దక్కాయి. 2017లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాకు అందకుండా.. బీజేపీ 325 స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం 100కు పైగా స్థానాలు దక్కించుకుంటుందన్న ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కేవలం 19 స్థానాలకు పరిమితమైంది.

గత అనుభవాలకు తోడు, తాజాగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ కూడా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ‘ఇండియా టుడే సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తెలుస్తున్నా.. నా అంచనా ప్రకారం టీఆర్ఎస్‌కు విజయం అంత సులభం కాదు. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది’ అని రాజ్‌దీప్ ట్వీట్ చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. దీంతో, ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమనే అంశంలో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు, రాజ్‌దీప్ తనకు ఫోన్ చేశారని, ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టు ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం.. జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై మరింత అస్పష్టతకు దారితీసింది. మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే.


Published by: Santhosh Kumar Pyata
First published: December 8, 2018, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading