తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు... ఏపీఎస్ఆర్టీసీ మద్దతు

తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడితే... ఏపీలోనూ ఉద్యమిస్తామని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.

news18-telugu
Updated: October 6, 2019, 7:11 AM IST
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు... ఏపీఎస్ఆర్టీసీ మద్దతు
ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు సేవలు పొందేలా వెబ్ సైట్ ఆధునీకరిస్తోంది.
  • Share this:
తెలంగాణలో గత రెండు రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా దసరా సెలవులకు ఊళ్లకు వెళ్లేవారికి బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వేరే దారిలేక సొంతవాహనాలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సైతం అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడితే... ఏపీలోనూ ఉద్యమిస్తామని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. న్యాయమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో... టీఎస్ఆర్టీసీ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారని ఏపీ ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.

టీఎస్ఆర్టీసీ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చించి డిమాండ్లను పరిష్కరిస్తే... అటు ప్రజలకు ఇటు సంస్థకు ఇబ్బంది ఉండదన్నారు. అలా కాకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడం సరికాదని ఏపీ ఈయూ నేతలు చెబుతున్నారు. ఏపీలో మరో బలమైన కార్మిక సంఘం NMU కూడా తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపింది. కార్మికుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించి సమ్మెకు స్వస్తి పలకాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్ఎంయూ నేతలు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఇవాళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
First published: October 6, 2019, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading