దసరాలో ఏపీఎస్ ఆర్టీసీకి అదిరిపోయే బొనాంజ

తెలంగాణలో దసరా సీజన్ ఆరంభంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, ఏపీఎస్ ఆర్టీసీకి కలిసొచ్చింది.

news18-telugu
Updated: October 14, 2019, 8:49 AM IST
దసరాలో ఏపీఎస్ ఆర్టీసీకి అదిరిపోయే బొనాంజ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 14, 2019, 8:49 AM IST
ఓవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుండగా... అటు ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం ఫుల్ పండగ చేసుకుంటుంది. దసరా పండగ సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీకి లాభాల పంట పండింది. 2018తో పోలిస్తే, రూ. 20 కోట్లు అధికంగా రూ. 229 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దసరా పండగ సందర్భంగా స్పెషల్ సర్వీసులు, రెగ్యులర్ బస్సులకు మంచి డిమాండ్ ఉండటంతో ఆక్యపెన్సీ రేషియో 103 శాతానికి చేరిందని తెలిపారు.

గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 13 వరకూ మొత్తం 5,887 ప్రత్యేక సర్వీసులను నడిపించినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో దసరా సీజన్ ఆరంభంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, ఏపీఎస్ ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈ సీజన్ లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వారంతా తమ ప్రయాణానికి ఆంధ్రా బస్సులనే ఆశ్రయించారు. దీంతో ఏపీకి భారీగా ఆదాయం పెరగడానికి కారణమైంది. నిత్యమూ దాదాపు 40 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఏపీ బస్సులు, పండగ సీజన్ లో రోజుకు 75 వేల మందిని గమ్యాలను చేర్చాయి.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...