ఏపీ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజీపై ఏపీపీఎస్సీ సమీక్ష

ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చిందని ఆరోపించారు మాజీ సీఎం చంద్రబాబు.

news18-telugu
Updated: September 23, 2019, 8:01 AM IST
ఏపీ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజీపై ఏపీపీఎస్సీ సమీక్ష
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో  సచివాలయ పరీక్షల పేపర్ లీకేజీ ఆరోపణలపై ఏపీపీఎస్సీ సమీక్ష చేపట్టనుంది. ఏపీపీఎస్సీ కార్యదర్శి మౌర్య మధ్యాహ్నం 2.30 కి కమిషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమీక్ష తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఏపీపీఎస్సీ  ఇవ్వనుంది.

ఏపీ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలంటున్నారు. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చిందని ఆరోపించారు చంద్రబాబు. ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయి? అంటూ ప్రశ్నించారు. దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈ పేపర్ లీక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు చేసిన తప్పు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరీక్షల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసేలా కనిపిస్తోంది.దాదాపు 21 లక్షల మందికి పైగా అభ్యర్ధుల భవితవ్యంతో ముడిపడిన ఈ వ్యవహారంలో పేపర్ లీక్ అయిందనో, కాలేదనో స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం, అధికారులు, మంత్రులు మిన్నకుండిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...