3 రాజధానులుపై సీఎం జగన్ ట్విస్ట్.. రేపు మండలిలో ఏం జరగబోతోంది?

గత సమావేశాల్లోనే చర్చ జరిగినందున.. ఇప్పుడు చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇక బుధవారం మండలి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీటిపైనే ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: June 16, 2020, 8:59 PM IST
3 రాజధానులుపై సీఎం జగన్ ట్విస్ట్.. రేపు మండలిలో ఏం జరగబోతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ రాజధాని రచ్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీలో అనూహ్యంగా ఏపీ అభివృద్ధిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మరోసారి ఆమోదించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఇది చట్ట విరుద్ధమంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మండలిలో పెండింగ్‌లో ఉన్న బిల్లును మళ్లీ ఎలా ఆమోదిస్తారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో 3 రాజధానుల బిల్లులను బుధవారం మండలి ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఐతే మండలి ముందు బిల్లులు వస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని టీడీపీ సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

వాస్తవానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించారు. ఐతే మండలిలో వీటికి బ్రేకులు పడ్డాయి. మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎలాంటి చర్చ లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఐతే బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఆ బిల్లులు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. మూడు రాజధానుల ఏర్పాటు శాసన ప్రక్రియ దశలో ఉందని ఉదయం గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్యాహ్నం ఆ బిల్లులను ప్రవేశపెట్టి.. ఆమోద ముద్రవేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

గత సమావేశాల్లోనే చర్చ జరిగినందున.. ఇప్పుడు చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇక బుధవారం మండలి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీటిపైనే ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో ఈ బిల్లులపై మండలిలో రచ్చ రచ్చ జరిగింది. వైసీీప సభ్యులు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను దూషించారని టీడీపీ నేతలు... చంద్రబాబు నాయుడు గ్యాలరీలో కూర్చొని ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు మళ్లీ ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: June 16, 2020, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading