సీఎం జగన్‌‌కు ఆ నాలుగు ప్రసాదించు తల్లీ.. దుర్గమ్మకు రోజా మొక్కులు..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షేమంగా ఉండాలని ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా ప్రార్థించారు.

news18-telugu
Updated: October 8, 2019, 8:05 PM IST
సీఎం జగన్‌‌కు ఆ నాలుగు ప్రసాదించు తల్లీ.. దుర్గమ్మకు రోజా మొక్కులు..
సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షేమంగా ఉండాలని ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న రోజా.. జగన్ బాగుండాలని ప్రార్థించినట్టు చెప్పారు. ‘సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఆటంకం రావొద్దు. ప్రజలకు ఆయన అన్ని రకాలుగా సేవ చేసేందుకు సహాయ సహకారాలు అందించాలి. రాజన్న పాలన అందరికీ అందేలా అమ్మవారు ఆశీర్వదించాలి. జగన్ మోహన్ రెడ్డికి శక్తి, ఆరోగ్యం, బలం, ఆలోచన శక్తి ఇవ్వాలి.’ అని అమ్మవారికి మొక్కుకున్నట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ మోహన్ రెడ్డి కీలక సంస్కరణలు తెచ్చారు. పలు సంక్షేమపథకాలు అమలు చేశారు. రాష్ట్రం బాగుండాలంటే, సీఎం జగన్ బాగుండాలన్నారు. మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన బాగుంటుందనే విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో రుజువైందని, ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే జరుగుతుందని, ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని రోజా ఆకాంక్షించారు.

ఆటోలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్న రవాణా సిబ్బంది

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading