హోమ్ /వార్తలు /రాజకీయం /

జయలలిత మృతి కేసు: ప్రభుత్వానికి షాక్..విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

జయలలిత మృతి కేసు: ప్రభుత్వానికి షాక్..విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

తమిళనాడు చిత్రపటం

తమిళనాడు చిత్రపటం

మద్రాస్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తి అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అపోలోకు ఊరట కలిగిస్తూ తీర్పు వెలువరించింది. అర్ముగస్వామి కమిటిషన్ విచారణపై స్టే విధించి తమిళనాడు ప్రభుత్వానికి షాకిచ్చింది.

ఇంకా చదవండి ...

  తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఆమె మృతిపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ విచారణను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు తెరపైకి రావడంతో పూర్తిస్థాయి దర్యాప్తునకు జస్టిస్ అర్ముగస్వామి కమిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. ఐతే జయలలిత ట్రీట్‌మెంట్‌కు చెందిన రికార్డులను ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరడంతో అందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించింది.


  ఈ నేపథ్యంలో కమిషన్‌కు వ్యతిరేకంగా గతంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది అపోలో యాజమాన్యం. ఐతే హాస్పిటల్ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ చేసుకోవచ్చని కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్రాస్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తి అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అపోలోకు ఊరట కలిగిస్తూ తీర్పు వెలువరించింది. అర్ముగస్వామి కమిటిషన్ విచారణపై స్టే విధించి తమిళనాడు ప్రభుత్వానికి షాకిచ్చింది.


  కాగా, తమిళనాడు దివంగత సీఎం 2016 డిసెంబర్ 5న చనిపోయారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అప్పటి నుంచి కేసుదర్యాప్తు కొనసాగుతుంది.


  First published:

  Tags: Jayalalithaa, Supreme Court, Tamilnadu

  ఉత్తమ కథలు