'చంద్రబాబు త్వరగా కోలుకోవాలి'.. ట్విటర్‌లో ఇండియా వైడ్ ట్రెండింగ్

చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే గెట్ వెల్ సూన్ చంద్రబాబు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అదే సమయంలో #APWelcomes3Capitals హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 6:30 PM IST
'చంద్రబాబు త్వరగా కోలుకోవాలి'.. ట్విటర్‌లో ఇండియా వైడ్ ట్రెండింగ్
చంద్రబాబు నాయుడు
  • Share this:
ట్విటర్‌లో చంద్రబాబు పేరు మార్మోగుతోంది. బుధవారం సాయంత్రం #GetWellSoonCBN హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు పలువురు వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేశారు. దాంతో వైసీపీ అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ కూడా తమ సత్తా చాటారు. #GetWellSoonCBN పేరుతో పదుల సంఖ్యలో పోస్టులు పెడుతూ ఆ హ్యష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

ఏపీలో మూడు రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానిని తరలిస్తూ అమరాతిని చంపేస్తున్నారంటూ సీఎం జగన్‌పై మండిపడుతున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని.. అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనకైనా తీసుకోవాలని.. లేదంటే రాజీనామా చేయాలని.. అల్టిమేటం ఇచ్చారు. అందుకు రెండు రోజుల పాటు డెడ్‌లైన్ పెట్టారు చంద్రబాబు.
ట్విటర్‌లో ట్రెండింగ్
చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తోంది. అమరావతి సెంటిమెంట్ ఉందని టీడీపీ నేతలు అంటున్నారని.. అలాంటప్పుడు వారే రాజీనామా చేసి తిరిగి, గెలవాలని సవాల్ విసురుతున్నారు. వాళ్లు గెలిస్తే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే గెట్ వెల్ సూన్ చంద్రబాబు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అదే సమయంలో #APWelcomes3Capitals హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading