బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్.. కేబినెట్ భేటీలో నిర్ణయం

జనవరి 26 నుంచి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకుని రావాలి.

news18-telugu
Updated: October 30, 2019, 3:58 PM IST
బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్.. కేబినెట్ భేటీలో నిర్ణయం
బాలయ్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ షాక్ ఇచ్చారు. గత చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో బాలకృష్ణ వియ్యంకుడికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద కేటాయించిన 498 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములతో పాటు విశాఖలో లులు గ్రూప్‌నకు కేటాయించిన 13.83 ఎకరాలు (విలువ రూ.1500 కోట్లు) రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. జనవరి 26 నుంచి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకుని రావాలి.

బాలయ్య రెండో వియ్యంకుడికి జగ్గయ్యపేటలో చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున భూములు కట్టబెట్టిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేశారు. దీనిపై బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ స్పందించారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆ భూములు లీజుకు ఇచ్చారని కొన్ని పత్రాలు చూపించారు. అయితే, చంద్రబాబునాయుడి హయాంలో వచ్చిన మరికొన్ని జీవోలను బొత్స బయటపెట్టారు.

బైక్ స్టంట్స్‌తో నవ్వులు.. క్షణాల్లో భయంతో అరుపులు..First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు