Andhra Pradesh: వాలంటీరు అత్యుత్సాహం..? చనిపోయిన మహిళకు ఫించన్

Andhra Pradesh: వాలంటీరు అత్యుత్సాహం..? చనిపోయిన మహిళకు  ఫించన్

చనిపోయిన మహిళకు ఓ వాలంటీర్ పెన్షన్ ఇచ్చాడు.. అయితే అది అత్యుత్సాహం అంటున్నారు కొందరు.. కాదు మానత్వంతో ఇచ్చాను అంటున్నాడు వాలంటీర్.. ఇంతకి ఎవరి వాదన నిజం

చనిపోయిన మహిళకు ఓ వాలంటీర్ పెన్షన్ ఇచ్చాడు.. అయితే అది అత్యుత్సాహం అంటున్నారు కొందరు.. కాదు మానత్వంతో ఇచ్చాను అంటున్నాడు వాలంటీర్.. ఇంతకి ఎవరి వాదన నిజం

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా ఇంటింటి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. ఒకటవ తేదీ కావడంతో ఆయ గ్రామాల వాలంటీర్లు వారి పరిధిలో ఉన్నవారి ఇంటికి వెళ్లి అర్హులకు పెన్షన్ అందించారు. పెన్షన్లు ఇచ్చిన వెంటనే వారి నుంచి వేలు ముద్రలు కూడా తీసుకున్నారు. రాష్ట్రావ్యాప్తంగా ఈ కార్యక్రమం బాగానే సాగింది. అయితే విజయనగరం జిల్లాలో ఓ వాలంటీరు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అధికారులు అతడిపై చర్యలు తీసుకోడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం అతడు చేసినదాంట్లో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు..

    విజయనగరం జిల్లాల్లోని గుర్ల గ్రామంలో ఇజ్జిరోతు త్రినాథ్ అనే వ్యక్తి వాలంటీరుగా పని చేస్తున్నారు. అదే గ్రామంలో ఎర్ర నారాయణ అనే మహిళకు పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. దీంతో పెన్షన్ ఇచ్చేందుకు ఉత్సాహంగా నారాయణ ఇంటికి వెళ్లాడు వాలంటీర్. అయితే అప్పటికే ఆమె చనిపోయి కనిపించింది. మరి వాలంటీర్ ఏమనుకున్నాడో ఏమో.. చనిపోయిన ఆమెకు డబ్బులు ఇవ్వడమే కాకుండా.. ఆమె దగ్గర వేలిముద్రలు తీసుకున్నాడు.

    చనిపోయిన ఆమె దగ్గర వేలి ముద్రలు తీసుకోవడం ఏంటని గ్రామస్థులు.. నారాయణ బంధువులు నిలదీశారు. చనిపోయిన బాధలో తామంతా ఉంటే వేలు ముద్రలు ఇప్పుడు అవసరమా అంటూ నిలదీశారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత వారి వేలిముద్రలు పనిచేయవని సుబ్బారావు తెలిపారు. ఘటనపై విచారణకు పీడీ ఆదేశించారు. గుర్ల ఎంపీడీవో‌ను విచారణ అధికారిగా పీడీ నియమించారు.

    అయితే వాలంటీరు మాత్రం తన తప్పేముందని ప్రశ్నిస్తున్నాడు.. అయ్యో పాపం అని జాలి పడి.. వారి కుటుంబ సభ్యులుక ఖర్చులకైనా పనికొస్తాయి కదా అని పెన్షన్ ఇస్తే తప్పా అని అంటున్నాడు.. మరి పెన్షన్ డబ్బులు ఇచ్చిన తరువాత వేలి ముద్రలు తీసుకోకపోతే పై అధికారులు ప్రశ్నిస్తారని.. అందుకే వేలి ముద్రలు తీసుకోవాల్సి వచ్చింది అంటున్నాడు. అంత కష్టంలో ఉన్నవారికి డబ్బులు ఇవ్వడం తాను చేసి తప్పా అని నిలదీస్తున్నాడు...

    అయితే ఈ ఘటన గురించి విన్న ఇతర వాలంటీర్లు కూడా.. త్రినాథ్ చేసినదాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మానవత్వం చూపించడమే తప్పు అంటే ఈ ఉద్యోగాలు చేయడమెలా అని ప్రశ్నిస్తున్నారు..

    ఈ ఘటనపై విచారణ చేసిన అధికారుల వివరణ వేరేలా ఉంది. వాలంటీరు వెళ్లే సరికి ఆమె బతికి ఉందని.. అందుకే ఆధారం కోసం వేలిముద్రలు తీసుకునే ఫోటో పెట్టాడని వివరణ ఇచ్చారు.. ఈ వివరణ లేఖపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు