• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP TDP MLA NIMMALA RAMANAIDU SAYS WILL GIVE PRIVILEGE NOTICE ON MINISTER KURASALA KANNABABU BA GNT

AP Assembly: ఏపీ మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

AP Assembly: ఏపీ మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ శాసనసభను తప్పుదోవ పట్టించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ శాసనసభను తప్పుదోవ పట్టించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతులకు పంటల బీమా చెల్లింపులకు సంబంధించి ప్రీమియం కట్టకుండానే కట్టేశామని చెప్పారని, సభలో మంత్రి ప్రకటించిన తర్వాత నిన్న రాత్రి (నవంబర్ 30) ఆర్థిక శాఖ నుంచి దానికి సంబంధించిన ఆమోదం వచ్చిందని తెలిపారు. ‘రైతుల్ని సీఎం జగన్ నిట్టనిలువునా ముంచుతున్నారు. రైతులకు పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎన్నికల ముందు ఉదరకొట్టారు. ఏడాదిన్నరగా 7 విపత్తులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తే రూపాయి కూడా రైతులకు బీమా సొమ్ము చెల్లించలేదు. దీనిపై ప్రశ్నిస్తుంటే నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం అన్ని రాష్ట్రాలకు క్లెయిమ్స్ ఉంటే ఏపీకి మాత్రమే లేవు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించనందుకే సున్నా క్లైయిమ్స్ ఉన్నాయి. వీటిపై చంద్రబాబు మాట్లాడితే సమాధానం చెప్పలేరనే ఆయనకు మైక్ ఇవ్వలేదు. రూ.1033కోట్లు ప్రీమియం చెల్లించామని నిన్న ఉదయం కన్నబాబు సభలో మాట్లాడారు. నిన్న రాత్రి దీనికి సంబంధించి బడ్జెట్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు కట్టిన ప్రీమియం ఇప్పటివరకు వరకు జరిగిన పంట నష్టాలకు ఎలా వర్తిస్తుంది? కన్నబాబు సభను తప్పుదోవ పట్టించినందుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం.’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.

    మరోవైపు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా అమ్మిరెడ్డి తనను బెదిరించారని శాసన మండలి చైర్మన్‍కు నారా లోకేశ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్టును తప్పుపడితే తన హక్కులకు భంగం కలిగించేలా ట్విట్టర్‍లో అమ్మిరెడ్డి తననుద్దేశించి పోస్టులు పెట్టారని లోకేశ్ అన్నారు.

    నిమ్మల రామానాయుడు సస్పెన్షన్
    అంతకు ముందు ఏపీ అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడును ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా రెండో రోజు కూడా నిరసన తెలిపారు. దీంతో నిమ్మల రామానాయుడును ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేయడానికి శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. అందుకు సభ ఆమోదం కూడా తెలపడంతో నిమ్మల రామానాయుడును సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా నిమ్మల, టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో మార్షల్స్‌ను పిలవాలని స్పీకర్ అసెంబ్లీ సిబ్బందికి సూచించారు. అనంతరం సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు