• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP TDP LEADER KOLLU RAVINDRA REACTION ON MURDER ATTEMPT ON MINISTER PERNI NANI SK

Perni Nani: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం.. వైసీపీపై టీడీపీ విమర్శలు

Perni Nani: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం.. వైసీపీపై టీడీపీ విమర్శలు

పేర్ని నాని

Murder attempt on Perni nani: నాగేశ్వరరావును టీడీపీ వ్యక్తిగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పనులు లేక కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తే టీడీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.

  • Share this:
    మంత్రి పేర్ని నాని (Perni Nani)పై హత్యాయత్నం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పేర్ని నానిపై తాపీతో దాడిచేయబోయిన నాగేశ్వరరావు.. టీడీపీకి చెందిన వ్యక్తిగా జరుగుతున్న ప్రచారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) స్పందించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మంత్రిపై జరిగిన హత్యాయత్నానికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. నాగేశ్వరరావును టీడీపీ వ్యక్తిగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పనులు లేక కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తే టీడీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర.

    ఇవాళ ఉదయం మచిలీపట్నంలో ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు అతడిని పట్టుకొని నిలువరించారు. మంత్రిపై దాడి చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి.. దాడికి యత్నించాడు. మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నాని తృటిలో తప్పించుకున్నాడు. అనంతరం తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ మంత్రి పేర్ని నానిని పరామర్శించారు. దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    మంత్రి పేర్నినాని తల్లి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్దకర్మ కార్యక్రమాల అనంతరం.. అందరూ భోజనాలకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని.. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు గేట్ వద్దకు వచ్చారు. అదే సమయంలో నాగేశ్వరరావు మంత్రి వద్దకు వచ్చి, కాళ్లు మొక్కుతున్నట్లు నటించాడు. తాపీతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని వెనక్కి లాగారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: