• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP TDP LEADER EX MP MAGANTI BABU SON RAMJI SUICIDE ATTEMPT BY CONSUMING SLEEPING TABLETS SK

Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం

మాగంటి బాబు (ఫైల్ ఫొటో)

మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ (TDP) నాయకుడు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పలువురు టీడీపీ నేతలు మాగంటి బాబును పరామర్శిస్తున్నారు. రాంజీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఐతే రాంజీ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో కారణాలు తెలియాల్సి ఉంది.

    మాగంటి రాంజీ తండ్రి మాగంటి బాబు 2014 నుంచి 2019 వరకు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు. గతంలోనూ ఓసారి ఆయన ఎంపీగా పనిచేశారు. అంతేకాదు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగానూ సేవలందించారు. అప్పటి ప్రభుత్వంలో 2007 నుంచి 2009 వరకు మంత్రిగానూ పనిచేశారు. ఐతే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీచేసి మాగంటి బాబు ఓడిపోయారు. ఆయనపై వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ విజయం సాధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: