HOME » NEWS » politics » AP TDP GOVERNMENT WILL BE NO MORE IF THEY GIVE CALL TO STOP PM MODI MEETING WARNS BJP MP GVL NARASIMHA RAO AK

అదే జరిగితే... ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండదు... బీజేపీ ఎంపీ వార్నింగ్

ఏపీలోని అధికార పార్టీకి, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకోవాలని ప్రకటనలు చేస్తే... రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఉండదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.

news18-telugu
Updated: February 9, 2019, 4:34 PM IST
అదే జరిగితే... ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండదు... బీజేపీ ఎంపీ వార్నింగ్
చంద్రబాబు నాయుడు, జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆదివారం గుంటూరులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనబోయే సభ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని కొందరు... నిరసన తెలియజేస్తామని మరికొందరు టీడీపీ నేతలు ప్రకటించారు. మోదీ గో బ్యాక్ అంటూ విజయవాడ, గుంటూరు నగరాల్లో హోర్డింగ్స్ కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏపీలోని అధికార పార్టీకి, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకోవాలని ప్రకటనలు చేస్తే... రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఉండదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.

రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సభకు వాహనాలు ఇవ్వొద్దంటూ వాహనాల యజమానులను ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని... సభకు జనం రాకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ సభ పట్ల టీడీపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది ? దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి
First published: February 9, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading