అల్లు అర్జున్ ఇల్లు ముట్టడిస్తామంటున్న విద్యార్థులు

నిరసన సెగలు మరీ ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.

news18-telugu
Updated: January 11, 2020, 10:34 AM IST
అల్లు అర్జున్ ఇల్లు ముట్టడిస్తామంటున్న విద్యార్థులు
అల్లు అర్జున్ (Source: Facebook)
  • Share this:
సంక్రాంతి పోరులో అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురంలో’ అంటూ ఆదివారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ మాట్లాడుతూ.... జేఎన్‌యూ దాడి ఘటనపై స్పందించాడు.Jnu‌లో విద్యార్థులపై దాడి సరికాదని జాతీయ మీడియా ఎదుట బన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో బన్ని తీరుపై ఏపీ విద్యార్థులు మండిపడుతున్నారు. జేఎన్‌యూ సంగతి సరే.. మరి ఏపీ రాజధాని ఆందోళనలపై ఎందుకు స్పందించలేదంటూ మండిపడుతున్నారు. అమరావతిలో రాజధాని కోసం రైతులు పోరాడుతంటే.. సినిమా హీరోలు ఒక్కరూ కూడా మద్దతివ్వడం లేదని మండిపడుతున్నారు. ఈ నెల 19వరకు హీరోల ఇంటి వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే మహేష్ బాబుకు నిరసన సెగ తాకింది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు షాక్ ఇచ్చారు ఏపీ విద్యార్థులు. హైదరాబాద్‌లో ఆయన ఇంటి ముందు విద్యార్థి సంఘాల నేతలు దీక్షకు దిగారు. అమరావతిలో రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ... జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి దీక్షకు దిగింది. దీంతో మహేష్‌కు రాజధాని నిరసన సెగ తాకిందని టాలీవుడ్‌లో చర్చ మొదలయ్యింది. సరిలేరు నికెవ్వరూ సినిమాతో తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండగను తీసుకొచ్చేందుకు రెడీ అయిన మహేష్‌కు ఇప్పుడు విద్యార్థుల ఆందోళనలతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.అయితే రాజధాని నిరసన సెగలు మరీ ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.
Published by: Sulthana Begum Shaik
First published: January 11, 2020, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading