ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండోరోజు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ... సీఎం జగన్‌తో భేటీ పట్ల వివరణ ఇచ్చారు. అయితే వంశీ మాటల్ని టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సభలో వంశీ నాకు హక్కులుండవా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు,నారా లోకేష్, టీడీపీపై విమర్శలు గుప్పించారు. అయితే అదే సమయంలో చంద్రబాబు బయటకు వెళ్లిపోయారని వంశీయే చెప్పుకొచ్చారు. అయితే తాను టీడీపీ సభ్యుడినేని కానీ.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌కు తమ్మినేని సీతారంకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల కోసం తాను సభలో ఉండాలన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకు సీటు కేటాయిస్తామన్నారు స్పీకర్. అక్కడున్న అసెంబ్లీ సిబ్బందితో అప్పుడే మాట్లాడి వంశీకి సీటు కేటాయించాలన్నారు. వంశీ ఎక్కడ కావాలంటే అక్కడు కూర్చోవాలన్నారు స్పీకర. పలు సీట్ల నెంబర్లు చెబుతూ ఆ సీట్లు ఖాళీగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు తమ్మినేని.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.