మరోసారి నోరు పారేసుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తన నోటికి పని చెప్పారు. ఇంతకుముందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీపై వాడిన భాష తీవ్ర దుమారం రేపగా తాజాగా అలాంటి ఘటనే నిన్న చోటు చేసుకుంది.

news18-telugu
Updated: November 29, 2019, 10:12 AM IST
మరోసారి నోరు పారేసుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
తమ్మినేని సీితారాం
  • Share this:
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తన నోటికి పని చెప్పారు. ఇంతకుముందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీపై వాడిన భాష తీవ్ర దుమారం రేపగా తాజాగా అలాంటి ఘటనే నిన్న చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులను కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే.. పూలే వర్ధంతి కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ఉద్యోగులపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి చెప్పారు గానీ, జిల్లా అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం అయితే.. స్పాట్‌లోనే కొడతానంటూ అధికారులను హెచ్చరించారు. ఆయన్ను పిలవకపోవడంపై వివరణ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించినా పట్టించుకోలేదు.

సమయాభావం వల్ల సమాచారం ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతుంటే అవన్నీ తనకు చెప్పొద్దని, డ్యూటీలు సక్రమంగా చేసుకోవాలంటూ గట్టిగానే మందలించారు. కాగా, ప్రభుత్వ అధికారులను కొడతానంటూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి చేయడం ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది. స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>