చంద్రబాబును సస్పెండ్ చేయాలి.. స్పీకర్ రియాక్షన్ ఇదే..

ఏపీ అసెంబ్లీ రసాభాసగా మారింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిని ఉద్దేశిస్తూ మర్యాదగా ఉండదు అంటూ టీడీపీ చీఫ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై శాసనసభ గరంగరంగా మారింది.

news18-telugu
Updated: December 11, 2019, 10:42 AM IST
చంద్రబాబును సస్పెండ్ చేయాలి.. స్పీకర్ రియాక్షన్ ఇదే..
చంద్రబాబు, స్పీకర్ తమ్మినేని
  • Share this:
ఏపీ అసెంబ్లీ రసాభాసగా మారింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిని ఉద్దేశిస్తూ మర్యాదగా ఉండదు అంటూ టీడీపీ చీఫ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై శాసనసభ గరంగరంగా మారింది. స్పీకర్‌కు సభ్యత లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అటు.. స్పీకర్ కూడా చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, వైసీపీ సభ్యులు కూడా చంద్రబాబు హావభావాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. స్పీకర్ ఔన్నత్యాన్ని కించపరిచేలా ఆయన వ్యవహరించారని చెప్పారు. అయితే.. వైసీపీ సభ్యులు మాట్లాడిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. సభను ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనకు ఉన్నందున.. చంద్రబాబును మన్నిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>