ఏపీలో వల్లభనేని వంశీ కొత్త ట్రెండ్... టీడీపీలో పెను మార్పులు ?

వల్లభనేని వంశీ కచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తే... టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి రాజీనామా చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు వెనకాడతారనే ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: December 10, 2019, 5:48 PM IST
ఏపీలో వల్లభనేని వంశీ కొత్త ట్రెండ్... టీడీపీలో పెను మార్పులు ?
వల్లభనేని వంశీ మోహన్(File)
  • Share this:
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త దారి చూపించారా ? టీడీపీకి దూరంగా ఉండి, అధికారం పార్టీకి దగ్గర కావాలనుకునే వారికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ ఓ క్లారిటీ ఇచ్చిందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీకి రాజీనామా చేసిన తనను అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ తమ్మినేని సీతారాం సానుకూలంగా స్పందించారు. ఆయనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారు. దీంతో ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

వల్లభనేని వంశీ కచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తే... టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి రాజీనామా చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు వెనకాడతారనే ప్రచారం జరిగింది. అయితే వంశీ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం వారికి వరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. వంశీ బాటలోనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నడిస్తే... టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదా గల్లంతు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వంశీ ఫార్ములానే తమకు కూడా వర్తింపజేస్తే... టీడీపీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.







First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>