బీజేపీలో టీడీపీ ఎంపీల చేరికపై...ఏపీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే అలా చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు తమ్మినేని.

news18-telugu
Updated: August 4, 2019, 1:38 PM IST
బీజేపీలో టీడీపీ ఎంపీల చేరికపై...ఏపీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్. స్పీకర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉందన్నారు.మీడియా క్రియాశాలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారాయన.వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాలుగు స్తంభాల్లాంటి వ్యవస్థల కంటే పౌరవ్యవస్థ అనే మరో శక్తివంతమైన వ్యవస్థ ఉందన్నారు. శాసన సభ అద్దం లాంటిదని వ్యాఖ్యానించారు తమ్మినేని. బిల్లులపై శాసనసభలో సమగ్ర చర్చ జరిగితేనే అన్ని అంశాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన అభిప్రాయ పడ్డారు.

టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినే అడగాలన్నారు. అనైతికతను ప్రోత్సహించవచ్చా అని మీడియా ప్రతినిధులే వెంకయ్యనాయుడినే ప్రశ్నించాలన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు కావాలనేది తన అభిప్రాయమన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించనన్నారు. రాజ్యసభ లో టీడీపీ సభ్యుల్నిచేర్చుకోవడం తప్పే అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే అలా చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు తమ్మినేని. అనైతికను శాసనసభలో ప్రతిపక్ష టీడీపీ గొంతునొక్కే ఉద్దేశం తనకు లేదన్నారు.

నాపై ఎవరి ఒత్తిళ్లు లేకపోవడం వల్లే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నానన్నారు. చట్టాలు చేసే మేమే వెళ్లి అధికారులపై ఆధిపత్యం చేయడం దురదుష్టకరమన్నారు తమ్మినేని. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతోందన్నారు. స్పీకర్‌కు విచక్షణ అధికారాలు ఉంటాయన్నారు.ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకపోతేనే ఆశించిన మంచి ఫలితాలు వస్తాయని తమ్మినేని పేర్కొన్నారు.వ్యవస్థలు దిగజారిపోతుంటే పాత్రికేయులు వాటిని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. వ్యవస్థలు నాలుగు గుర్రాలపై పరుగులు తీస్తుంటాయని...పార్లమెంటరీలో కనిపించని ఐదో గుర్రమే మంచి పౌరుడన్నారు.

రాజ్యాంగం, వ్యవస్థలను మనమంతా కాపాడుకోవాలని తమ్మినేని పిలుపునిచ్చారు.రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షిస్తే ప్రజలకు ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నారు.ప్రజలు ప్రతి ఒక్క అంశాన్నీ పూర్తిగా పరిశీలిస్తున్నారన్నారు.పార్టీ ఫిరాయింపులపై చట్టసభల్లో సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శాసన సభలో 3 ఛానళ్లపై బ్యాన్ చేయడాన్ని ఆయన సమర్థించానన్నారు.శాసన సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్ లు ఇవ్వకూడదని నిబంధన ఉందన్నారు.
భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం విధించామన్నారు. శాసన సభ నిబంధనలు మీడియా సహా అంతా పాటించాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు స్పీకర్.
Published by: Sulthana Begum Shaik
First published: August 4, 2019, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading