అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ ఆగ్రహం... విచారణకు సీఎంకు విజ్ఞప్తి

అమరావతిలో భూకుంభకోణాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని సీఎంకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సీఎం జగన్ ఖచ్చితంగా మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: January 20, 2020, 1:47 PM IST
అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ ఆగ్రహం... విచారణకు సీఎంకు విజ్ఞప్తి
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
సభలో అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా... అచ్చెన్నాయుడు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారంటూ బొత్స మండిపడ్డారు. నాకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు అని బొత్స అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. బొత్స ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు అచ్చెన్నాయుడు. దీంతో స్పీకర్ అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు. అమరావతిలో భూకుంభకోణాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని సీఎంకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. విచారణ అంటే మీరెందుకు ఉలికి పడుతున్నారంటూ టీడీపీనేతలకు చురకలంటించారు స్పీకర్. ఏ తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం అంటూ తమ్మినేని ప్రశ్నించారు. దీంతో స్పందించిన సీఎం జగన్ ఖచ్చితంగా మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. స్పీకర్‌కు ఆ అధికారులు ఇచ్చే హక్కు ఉందన్నారు జగన్.

అంతకుముందు సభలో మాట్లాడిన బొత్స... చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ రాయలేదా ? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇవాళ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బొత్స. మీ లాంటి నాయుకడు వల్లే ఈ రోజు మనకు ఈ దౌర్భగ్యం పట్టిందన్నారు. అచ్చెన్నాయుడు అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ... బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు