సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

వెంటనే స్పీకర్ ఛైర్ నుంచి లేచి ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.

news18-telugu
Updated: January 21, 2020, 11:38 AM IST
సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. జై అమరావతి అంటూ సభలో నినాదాలు చేశారు. సభలో ఎస్టీఎస్సీ బిల్లును ప్రవేశ పెడతుండగా... టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది. స్పీకర్ చెప్పిన వినకుండా తమ ఆందోళనను కనొసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర అసహనానికి గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు.  టీడీపీ సభ్యలు గొడవతో సభను రన్ చేయలేనని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పీకర్ ఛైర్ నుంచి లేచి ఆయన వెళ్లిపోయారు.

మరోవైపు నిన్న కూడా స్పీకర్ సభలో టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహించారు. అమరావతిలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ జరపాలంటే ఏకంగా సభ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సోమవారం సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు వారిని కూర్చోవాలని సీఎం జగన్ కోరారు.

అనంతరం పోడియం వద్ద గందరగోళం చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. జగన్ విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా టీడీపీ సభ్యులు మాత్రం సభలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో తన మాట వినడం లేదని తీవ్ర ఆవేదర వ్యక్తం చేస్తూ స్పీకర్ తమ్మినేని సభ నుంచి ఇవాళ వెళ్లిపోయారు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు