ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో నా పాపం ఉంది... ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

ఆ పాపం చేసిన దానికే తాను 16 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 9:56 AM IST
ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో నా పాపం ఉంది... ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో నాకు భాగస్వామ్యం ఉందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అప్పట్లో సభలో ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆ పాపం చేసిన దానికే తాను 16 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదన్నారు. శాసనసభ స్పీకర్ గా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన పరిమితులు, అధికారాలు తనకు తెలుసన్నారు తమ్మినేని. స్పీకర్‌గా తనకున్న అధికారాలతోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీకి మాట్లాడే అవకాశం కల్పించానన్నారు.

సభ ప్రారంభం అవ్వగానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందిస్తూ స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ పార్టీ ఏదైనా సరే ఏపార్టీకి చెందినవారైనా సరే మట్లాడే అవకాశం కల్పించాల్సిన అవసరం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు తమ్మినేని.
First published: December 10, 2019, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading