Home /News /politics /

ఏపీ స్పీకర్ బూతులు... చంద్రబాబుపై ఆమాట ప్రయోగించిన తమ్మినేని

ఏపీ స్పీకర్ బూతులు... చంద్రబాబుపై ఆమాట ప్రయోగించిన తమ్మినేని

తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)

తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)

గతంలో చంద్రబాబు, సోనియా పొత్తుపై తీవ్రంగా స్పందిస్తూ... అనకూడని మాటను ప్రయోగించారు తమ్మినేని.

    ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్న అసభ్య పదజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో చంద్రబాబు, సోనియా పొత్తుపై తీవ్రంగా స్పందిస్తూ... అనకూడని మాటను ప్రయోగించారు తమ్మినేని. ఈ సందర్భంగా సోనియాపై కూడా విమర్శలు చేశారు. జగన్‌కు సోనియాకు చాలా తేడాలున్నాయన్నారు. జగన్ గర్వించ దగ్గ భారతీయ పౌరుడంటూ కొనియాడారు. సీఎం జగన్ తిరుమల ఆలయం ప్రవేశంపై మీడియా అడిగినప్రశ్నలకు ఏపీ స్పీకర్ ఇలా సహనం వదిలి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు తమ్మినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మరోవైపు తమ్మినేని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. వైసీపీ మంత్రులు, స్పీకర్ బాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. స్పీకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీని కోరామన్నారు. తమ్మినేని స్పీకరా..? లేదంటే బ్రోకరా..? అని ప్రశ్నిస్తున్నానన్నారు. సీఎం జగన్ వెంటనే స్పీకర్‌ను బర్తరఫ్ చేయాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam, Chandrababu naidu, Sonia Gandhi, Tammineni sitaram, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు