• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP SPEAKER KODELA SIVA PRASADA RAO DANCE WITH VOTERS DURING ELECTION CAMPAIGN

Video: స్పీకర్ కోడెల స్టెప్పులేస్తే ఇలా ఉంటుంది..

Video: స్పీకర్ కోడెల స్టెప్పులేస్తే ఇలా ఉంటుంది..

ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేస్తున్న కోడెల శివప్రసాదరావు

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడెల శివప్రసారావు స్టెప్పులు వేశారు.

  • Share this:
    ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా రాజకీయ నేతలు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు ఇస్త్రీ చేస్తుంటారు. కొందరు కుండలు చేస్తుంటారు. మరికొందరు కటింగ్‌లు చేస్తుంటారు. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓటర్లతో కలసి డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇప్పుడు అదే పని చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడెల శివప్రసారావు స్టెప్పులు వేశారు. తలకు పసుపు టవల్ కట్టుకుని లంబాడా మహిళలతో కలసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఓ వైపు డప్పు చప్పుళ్ల ఉత్సాహం, మరోవైపు మహిళల జోష్‌ను చూసిన కోడెల తాను కూడా పదం కలిపారు.

    First published: