చంద్రబాబును కలిసిన స్పీకర్ కోడెల... ఇనిమెట్ల ఘటనపై చర్చ

ఇనిమెట్ల ఘటనపై మంగళవారం కోడెలపై కేసు నమోదు అయ్యింది. రాజుపాలెం పోలీసు స్టేషన్ కేసు ఫైల్ చేశారు.

news18-telugu
Updated: April 17, 2019, 12:15 PM IST
చంద్రబాబును కలిసిన స్పీకర్ కోడెల... ఇనిమెట్ల ఘటనపై చర్చ
చంద్రబాబుతో కోడెల భేటీ
news18-telugu
Updated: April 17, 2019, 12:15 PM IST
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును స్పీకర్ కోడెల శివప్రసాదరావు భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటనపై వీరిద్దరు చర్చించారు. పోలింగ్‌ బూత్ వద్ద తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాల్ని సీఎంకు కోడెల వివరించారు.పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, వైసీపీ నేతల ఫిర్యాదులను చంద్రబాబుకు వివరిస్తున్నారు. ఇనిమెట్ల ఘటనపై మంగళవారం కోడెలపై కేసు నమోదు అయ్యింది. రాజుపాలెం పోలీసు స్టేషన్ కేసు ఫైల్ చేశారు. కోడెల ఎన్నికల రోజు బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డరని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలను 7వ నిందితునిగా చేర్చిన పోలీసులు. ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు, అతని అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇనిమెట్లలో కోడెలపై దాడి అంటూ టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై దాడి జరిగిందంటూ వార్త కలకలం రేగింది. కోడెల బట్టలు చిరిగేలా ఆయనపై వైసీపీ వర్గం దాడి చేసిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...