విచారం వ్యక్తం చేస్తారా లేదా.. చంద్రబాబుకు స్పీకర్ హెచ్చరిక..

ఏపీ అసెంబ్లీ ఆవరణలో గురువారం నాడు జరిగిన ఘటనపై సభలో చర్చ జరిగింది. తనను మార్షల్స్ నెట్టేశారని, సభకు రాకుండా గేటు మూసేశారని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. దానికి సంబంధించి ఈ రోజు సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం వీడియోను చూపించారు.

news18-telugu
Updated: December 13, 2019, 12:05 PM IST
విచారం వ్యక్తం చేస్తారా లేదా.. చంద్రబాబుకు స్పీకర్ హెచ్చరిక..
చంద్రబాబు, స్పీకర్ తమ్మినేని
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఆవరణలో గురువారం నాడు జరిగిన ఘటనపై సభలో చర్చ జరిగింది. తనను మార్షల్స్ నెట్టేశారని, సభకు రాకుండా గేటు మూసేశారని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. దానికి సంబంధించి ఈ రోజు సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం వీడియోను చూపించారు. అందులో.. చంద్రబాబు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగినట్లు ఉంది. దీనిపై ఈ రోజు సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్షల్స్‌ను బాస్టర్డ్ అని చంద్రబాబు తిట్టారని ఆరోపించారు. కాగా, బయటి వ్యక్తులు అసెంబ్లీ గేటు వద్దకు రావడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. అయితే.. నిన్న జరిగిన ఘటనపై సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన చదివి వినిపించారు. ఆ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విచారం వ్యక్తం చేయాలని, లేకపోతే సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. మీరు అనకూడని మాటను అన్నారని చెప్పారు. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే గౌరవం ఉంటుందని తమ్మినేని సూచించారు. కాగా, తనకు జరిగిన అవమానంపై ఎవరు విచారం వ్యక్తం చేస్తారని చంద్రబాబు స్పీకర్‌ను అడిగారు.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>