• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP SEC NIMMAGADDA WRITES LETTER TO GOVERNOR OVER ASSEMBLY RESOLUTION NS PNR

SEC vs AP Govt: అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం.. గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ

SEC vs AP Govt: అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం.. గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ...గవర్నర్ కు లేఖ రాశారు.

  • Share this:
    ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ...గవర్నర్ కు లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K కింద ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎలక్షన్ కమిషన్ విధి అని వివరాంరు. కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాన అధికారాలుంటాయన్న నిమ్మగడ్డ.. ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్ కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించాలని సూచించారు.

    ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై 10నెలలుగా వివాదం కొనసాగుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వెంటనే మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమించింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన రమేష్ కుమార్.. ప్రభుత్వంపై విజయం సాధించారు. తిరిగి ఎస్ఈసీగా ఛార్జ్ తీసుకున్న అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకున్నారు.

    దీనికి అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేందుకు ఎస్ఈసీ యత్నించగా విఫలమైంది. కొవిడ్ దృష్ట్యా అధికారులు హాజరుకాలేరంటూ సీఎస్ నీలం సాహ్నీ.. ఎస్ఈసీకి లేఖరాశారు. ఈ నేపథ్యంలో ప్రొసీడింగ్స్ పై స్టేటస్ కో ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు కోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వ పిటిషన్ పై వాదనలు పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయగా.. దానిని వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ కు లేఖ రాశారు.
    Published by:Nikhil Kumar S
    First published: