దివాకర్ ట్రావెల్స్‌కు ఆర్టీఏ అధికారుల షాక్... జేసీ వ్యాఖ్యల ఎఫెక్ట్ ?

ఏపీలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

news18-telugu
Updated: October 17, 2019, 11:36 AM IST
దివాకర్ ట్రావెల్స్‌కు ఆర్టీఏ అధికారుల షాక్... జేసీ వ్యాఖ్యల ఎఫెక్ట్ ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 17, 2019, 11:36 AM IST
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌కు ఏపీ ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. కమీషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్‌పై తమకు ఫిర్యాదు వచ్చాయని తెలిపారు.

మరోవైపు సీఎం జగన్, వైసీపీపై జేసీ దివాకర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే దివాకర్ ట్రావెల్స్‌పై ఈ రకమైన దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజుల పాటు సీఎం జగన్‌పై ఎలాంటి కామెంట్స్ చేయని జేసీ దివాకర్ రెడ్డి... ప్రధాని మోదీ మంత్రదండం కారణంగానే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు పరిపాలన అనుభవం లేదని... మంచి, చెడు చెప్పేవారు లేరని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా సీఎం జగన్ వ్యవహారం ఉందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...