దరిద్రం చుట్టూ ఏపీ రాజకీయం... నేతల మాటల తూటాలు

దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుందని విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించారు. జగన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడరని కొత్తగా చెప్పక్కర్లేదన్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 1:14 PM IST
దరిద్రం చుట్టూ ఏపీ రాజకీయం... నేతల మాటల తూటాలు
విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్న (File)
news18-telugu
Updated: October 23, 2019, 1:14 PM IST
ఏపీ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూ వేడిని మరింత రాజేస్తున్నారు. మీరు 8దరిద్రం అంటే మీరు దరిద్రం అని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వేసిన ఓ ట్వీట్‌తో ఈ దుమారం రేగింది. ‘ఒక వ్యక్తి తన ‘టచ్’ మహిమతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటిని కోలుకోలేకుండా చేశాడు. తన దరిద్రాన్ని అందరికీ అంటించి వచ్చాడు. వచ్చే జనవరిలో ఢిల్లీ, 2021 మేలో బెంగాల్ ఎలక్షన్లున్నాయి. వాటి ఫలితాలెలా ఉంటాయో మనం ఊహించవచ్చు. తనేమో బిజెపీ ‘క్షమాభిక్ష’ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ మండిపడింది.

విజయసాయిరెడ్డి ట్వీట్‌కు కౌంటర్‌గా ట్వీట్ వేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుందని విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించారు. ‘దరిద్రానికి ప్యాంటు,షర్టు వేస్తే మీలా ఉంటుంది @VSReddy_MP
గారు. ఇక మీ తుగ్లక్ ముఖ్యమంత్రి @ysjagan దరిద్రానికి బ్రాండ్ అంబాసిడరని కొత్తగా చెప్పక్కర్లేదు. అడుగుపెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసా రెడ్డిగారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని మింగేసారు, 256 రైతుల్ని మింగేసారు’ అటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. దీంతో ఇప్పుడు ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...