ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ... ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని సర్వేలు... టీడీపీకి అనుకూలంగా వస్తే... మరికొన్ని మాత్రం వైసీపీదే విజయమన్నారు. మొత్తం మీద మే 23 వరకు గెలుపుపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇప్పుడు ఏపీలో హాట్ నియోజకవర్గంగా మారింది. కారణం అక్కడ జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. ఆయనతో పాటు సోదరుడు నాగబాబు కూడా అదే జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత వచ్చింది. నరసరాపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు భీమవరంలో జరగనుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు భీమవరం వైపే మళ్లింది.
దీంతో పెద్ద ఎత్తున పవన్ అభిమానులతో పాటు... జనసేన కార్యకర్తలు నేతలు... భీమవరానికి చేరుకునేందుకు రెడీ అవుతున్నారు. కౌంటింగ్ రోజు భీమవరంలోనే బస చేసేందుకు ఇప్పటికే హోటల్స్‌ను బుక్ చేసుకున్నారు. ఒక్క జనసేన నాయకులే కాదు... ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం భీమవరానికి క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు భీమవరంలో హోటళ్లకు భలే డిమాండ్ వచ్చింది. హోటళ్లు అన్ని ఇప్పటికే బుక్ కూడా అయిపోయాయి,
మరోవైపు తాజాగా వచ్చిన ఏపీ ఎగ్జిట్ పోల్స్‌లో జనసేన గెలిచేది ఒక్క సీటు మాత్రమేనని తేలింది. అది కూడా భీమవరంలోనే మాత్రమే అని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆ పార్టీ మాత్రం నరసాపురంలో కూడా నాగబాబు గెలుస్తారని ఆశాభావంతో ఉన్నారు. తప్పకుండా అక్కడ కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా జనసేన పార్టీని తాజాగా జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేశారు. అందులో ఒకటి భీమవరం అయితే.. మరో సీటు గాజువాక. గాజువాకలో పవర్ స్టార్‌కు ఓటమి తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్, మరి ఇవి ఎంతవరకు నిజం అవుతాయో తేలాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.