చంద్రబాబు భేటీకి వెళ్లకుండా.. టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు

ఇవాళ సాయంత్రానికి కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రజా వేదికను కూల్చివేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.

news18-telugu
Updated: June 26, 2019, 1:22 PM IST
చంద్రబాబు భేటీకి వెళ్లకుండా.. టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
చంద్రబాబు (File)
  • Share this:
ఓ వైపు ప్రజావేదిక కూల్చివేత, మరో వైపు ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నిర్వహించిన సమావేవానికి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీనియర్లతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు నివాసానికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతించడం లేదు.  రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో బాబు సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికను కూల్చివేస్తున్నందున చంద్రబాబు నివాసం వైపు ఎవరిని కూడ అనుమతించడం లేదు. చంద్రబాబు నివాసానికి వెళ్లడానికి ప్రజా వేదిక ముందు నుండి వెనుక నుండి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ


చంద్రబాబు నివాసానికి పక్కనే ప్రజా వేదిక ఉంది. ఈ ప్రజా వేదికను మంగళవారం రాత్రి నుండే కూల్చివేస్తున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు టీడీపీ నేతలకు పోలీసులు అనుమతించడం లేదు. చంద్రబాబు నివాసంలో సమావేశం పేరుతో వెళ్లే పేరుతో ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉందని భావించి పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో పాటు సామాన్యులను కూడ ఈ వైపుకు అనుమతించడం లేదు. అయితే చంద్రబాబు నివాసానికి పోలీసుల కళ్లుగప్పి కొందరు నేతలు బాబు నివాసానికి చేరుకున్నారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీప్రజావేదిక భవనాన్ని తనకు ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. కానీ, ప్రజా వేదికను నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారని సీఎం జగన్ చెప్పారు. దీంతో ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అక్రమ భవనాలను కూల్చివేయనున్నట్టు జగన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రజావేదిక కూల్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు జేసీబీల సహాయంతో ఈ పనులు సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రజా వేదికను కూల్చివేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.
First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు