టీడీపీ సీనియర్ నేతకు పోలీసు సంఘం వార్నింగ్

రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీలోకి కొందరు నాయకులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసు సంఘం నేతలు విమర్శించారు.

news18-telugu
Updated: October 14, 2019, 7:11 PM IST
టీడీపీ సీనియర్ నేతకు పోలీసు సంఘం వార్నింగ్
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: October 14, 2019, 7:11 PM IST
టీడీపీ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం మండిపడింది. తమ మీద పదే పదే విమర్శలు చేస్తున్న వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ హెచ్చరించారు. పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. దానిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల జాతకాలు తన దగ్గర ఉన్నాయని వర్ల రామయ్య అనడాన్ని కూడా పోలీసు సంఘం తప్పుబట్టింది. ఆయన జాతకం మొత్తం కూడా తన దగ్గర ఉందని... తమపై విమర్శలు చేస్తే వాటిని బయటపెడతామని సంఘం నేతలు స్పష్టం చేశారు.

రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీలోకి కొందరు నాయకులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసు సంఘం నేతలు విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అనవసరంగా రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు సంఘం నేతలు హితవు పలికారు.






First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...