వైఎస్ వివేకా హత్య కేసులో... ఏపీ పోలీసుల రివర్స్ ఎటాక్

టీడీపీ నేత వర్లరామయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే వర్ల రామయ్య మాత్రం పోలీస్ యాక్షన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: October 16, 2019, 5:12 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో... ఏపీ పోలీసుల రివర్స్ ఎటాక్
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
ఏపీలో సంచలన రేపిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో పోలీసులు రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసిన నేతలకు పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ నేత వర్లరామయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే వర్ల రామయ్య మాత్రం పోలీస్ యాక్షన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ఇప్పటికీ వైఎస్ వివేకా హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నానన్నారు. అందరికీ నోటీసులు ఇస్తారా అంటూ పోలీసుల్ని తిరిగి ప్రశ్నించారు.

ఇటీవలే వైఎస్ వివేకా హత్య విషయంలో సుపారి గ్యాంగ్ హస్తమున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమంటూ పోలీసులు ఖండించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న పత్రికలు, మీడియాపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ డీజీపీ కూడా దీనిపై స్పందించారు. వైఎస్ వివేకా హత్య విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.


First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>