అమరావతిలో ఉద్రిక్తత.. నేతల గృహ నిర్బందం.. భారీగా పోలీసుల మోహరింపు..

ఏపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఈ రోజు జాతీయ రహదారులు దిగ్బంధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. అనుమతి లేదని నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

news18-telugu
Updated: January 7, 2020, 10:23 AM IST
అమరావతిలో ఉద్రిక్తత.. నేతల గృహ నిర్బందం.. భారీగా పోలీసుల మోహరింపు..
అమరావతిలో పోలీసులు
  • Share this:
ఏపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఈ రోజు జాతీయ రహదారులు దిగ్బంధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. అనుమతి లేదని నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తుగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కీలక నేతల ఇళ్లకు వెళ్లిని వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. హైవేల దిగ్బంధానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అడ్డుకొని, ఆయన ఇంటికి తాళం వేశారు. ఈ చర్యపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావును కూడా నిర్బంధించారు. కాగా, చినకాకాని గ్రామంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనే దాదాపు 2వేల మంది కోసం భోజనం తయారు చేస్తుండగా పోలీసులు అడ్డుకొని కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు.

అటు.. రాజధాని తరలింపును నిరసిస్తూ గద్దె రామ్మోహన్ దీక్ష కొనసాగుతోంది. ఆయనకు సంఘీభావం తెలిపిన నారా లోకేష్ సమక్షంలో.. కాసేపట్లో ఆయన దీక్ష విరమించనున్నారు. గద్దెకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా కేశినేని నానిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

First published: January 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు